Ileana Releases her baby bump Video: తెలుగు ప్రేక్షకులు ఎవరికీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమలో ఆమె ఒక స్టార్ హీరోయిన్గా అనేక సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగింది. చిన్న వయసులోనే దేవదాసు అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో మంచి క్రేజ్ లభించిన తర్వాత హిందీలో కూడా అడుగుపెట్టిన ఆమె అక్కడ కూడా అనేక హిట్ సినిమాల్లో భాగమై మంచి పేరు సంపాదించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు పీక్ లో ఉన్న టైంలోనే బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి అక్కడికి షిఫ్ట్ అయింది ఈ భామ. అలా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత ఒక విదేశీయుడితో ప్రేమలో పడి చాలా కాలం పాటు బాలీవుడ్ సినిమాలతో పాటు అన్ని సినిమాలకు దూరమై పూర్తిగా ప్రేమ మత్తులోనే మునిగిపోయింది.


ఆ తర్వాత అతనితో బ్రేకప్ అయ్యాక మళ్ళీ సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేసినా ఆమె ఏ మాత్రం అవకాశాలు అందుకోలేక పోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు, వీడియోలు షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ కొద్ది రోజుల క్రితం తల్లి కాబోతున్న అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. రెండు వారాల క్రితం తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని చెబుతూ ఒక చిన్నారి డ్రెస్సును అలాగే తన మెడలో మా మమ్మ అని రాసి ఉన్న ఒక లాకెట్ ఫొటోస్ షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.


Also Read: Mrunal Thakur Photos: 'స్వర్గం'లోనే దొరుకుతానంటూ సెగలు రేపే ఫోటోలు షేర్ చేసిన మృణాల్ ఠాకూర్


దానికి కారణం ఆమెకు ఇంకా వివాహం కాకపోవడమే. ఇలా పెళ్లి కాకుండా తల్లి కావడమేమిటి అని అందరూ ఆసక్తికరంగా అనేక రకాల కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఇదేదో సినిమా ప్రమోషన్స్ కోసమే ప్లాన్ చేసినట్టు ఉందని అందరూ భావించారు. అయితే ఈ విషయం ఇప్పుడు మరుగున పడిపోయింది కానీ తాజాగా ఆమె తన బేబీ బంప్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఆమె తల్లి కాబోతుందని విషయం ఈ బేబీ బంప్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.


అయితే ఆమెకు వివాహం కాలేదు కదా మరి తల్లి ఎలా అవుతుంది? ఆమె బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ రకరకాల కామెంట్లు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ అండ్రూతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. చాలాకాలం పాటు సహజీవనం కోసం కూడా చేసిన ఈ జంట 2019లో విడిపోయారు. ఆ తర్వాత సినిమాల్లో మరోసారి బిజీ అవ్వాలని ప్రయత్నం చేసిన ఇలియానా ఎందుకో మొదటిసారి సక్సెస్ అయినంత బాగా రెండవ సారి సక్సెస్ అవ్వలేకపోయింది.


ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు శభాష్టియన్ మిచల్తో ప్రేమలో ఉందని ఇలియానా గురించి కూడా పలు వార్తలు వచ్చాయి. గాని ఈ విషయాల మీద ఇప్పటివరకు ఏ ఒక్కరూ స్పందించలేదు. అనూహ్యంగా ఇప్పుడు తల్లి కాబోతున్నట్లుగా ఇలియానా బేబీ బంప్ షేర్ చేయడంతో ఆమె బిడ్డకు తండ్రి ఎవరు? అని కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమాల విషయంలో ఎలాంటి ఆఫర్స్ లేని ఈ భామ ఈ మధ్యనే ఒక వీడియో సాంగ్ లో కనిపించింది ఒకప్పుడు నాజూకుగా కనిపించిన ఈ భామ బొద్దుగా మారిపోయి ఆ సాంగ్లో కనిపించడం కూడా చర్చనీయాంశమైంది.


Also Read: Nora Fatehi Photos: బాడీ ఫిట్ జిమ్ వేర్లో నోరా అదిరే అందాలు.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook